బనశంకరి: కర్ణాటక నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ సుధా యాదవ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. ఆమెకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు భక్రు ప్రమాణస్వీకారం చేయిస్తారు. లోక్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొంటారు.
గెహ్లాట్‌కు వీడ్కోలు
ఐదేళ్లపాటు కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్ పనిచేశారు. బుధవారం ఆత్మీయంగా వీడ్కోలు వేడుక జరిగింది. గెహ్లాట్ మాట్లాడుతూ కర్ణాటకకు సేవ చేయడం తన భాగ్యమన్నారు.


