మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్న తాలూకాలోని కెఆర్ఎస్. పార్కులో ప్రభుత్వం నిర్వహిస్తున్న కావేరీ హారతికి వ్యతిరేకంగా, జిల్లా రైతు సంక్షేమ కమిటీ, వివిధ సంఘాల కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి బెంగళూరు–మైసూరు హైవేలో ధర్నా చేశారు. దసరా పండుగ సాకుతో, రైతులకు ఏమాత్రం ఉపయోగపడని కావేరీ హారతి వంటి భావోద్వేగ అంశాలతో అర్థంలేని ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. కావేరి నది దేశంలోని ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసింది, రైతుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని రాష్ట్ర ప్రభుత్వం, దొడ్డిదారిన కావేరీ హారతిని నిర్వహించడం ద్వారా వినోద, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తోందని నిరసనకారులు ఆరోపించారు. కావేరీ హారతి కార్యక్రమానికి బదులుగా, చెరువులను కావేరి నది నీటితో నింపి, కరువు రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణరాజసాగర్ డ్యాం 2031లో 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది, డ్యాం భద్రత దృష్ట్యా పరిసరాల్లో ఎలాంటి పనులు జరగకుండా చూడాలని కోరారు.


