శివమొగ్గ: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా శివమొగ్గలో కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. శివమొగ్గలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. అయితే నిరసనకారులు పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకుని, బారికేడ్లను తోసివేసి బీజేపీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జల ఫిరంగులతో ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ కార్యాలయం చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు.


