ఆదర్శనీయులు బసవణ్ణ | - | Sakshi
Sakshi News home page

ఆదర్శనీయులు బసవణ్ణ

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

గౌరిబిదనూరు: 12వ శతాబ్ధంలో సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలి సమాజ సంస్కరణకు బసవేశ్వరుడు కృషి చేయారని వక్తలు పేర్కొన్నారు. సోమవారం హీరేబిదనూరులో బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన వచనాలు సమాజానికి ఉపయుక్తమైనవని పేర్కొన్నారు. కాయకవే కై లాస అంటూ శ్రమ విలువను చాటి చెప్పారన్నారు. ఈసందర్భంగా మహిళలు జ్యోతులతో ర్యాలీ చేశారు.

శివాజీనగర: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని బసవేశ్వర సర్కిల్‌లో సోమవారం బసవణ్ణ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కే.నేమిరాజ నాయక్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే బసవణ్ణ అనుభవం మంటపం ద్వారా పాలనా వ్యవస్థను నిర్వహించి నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడని తెలిపారు. బసవణ్ణ ఆనాడే అక్కమహాదేవికి ఎంతో గౌరవమిచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పించినట్లుగానే ప్రధాని నరేంద్ర మోది తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కొందరు అభ్యంతరం చెప్పటం ఖండనీయమన్నారు. కార్యక్రమంలో మరియమ్మనహళ్లి మల్లికార్జున స్వామి, నందిపుర మహేశ్వర స్వామి, హంపసాగర నవిలి మఠం, కడల బాళు శాఖ గవిమఠం మరి మహాంతస్వామి, హలస్వామి మఠం హాల సిద్దేశ్వర స్వామి, ప్రముఖ నాయకులై బాదామి మృత్యుంజయ, వై.మల్లికార్జున, కొట్రేశ శెట్టర్‌, కిన్నాళ్‌ సుభాస్‌, సతీశ్‌ పాటిల్‌, ఎం.బసవరాజ్‌ రెడ్డి, చిత్తావడగి ప్రకాశ్‌, హనసి దేవరాజ్‌, జీ.ఎం.జగదీశ్‌, దొడ్డబసప్ప, తహశీల్దార్‌ కవిత ఆర్‌, తాలూకా పంచాయితీ ఈఓ పీ.విశ్వనాథ్‌, ఏ.డీ.రమేశ్‌ మహాలింగపుర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement