కదం తొక్కిన ఆశా కార్యకర్తలు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

కదం త

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు

సాక్షి బెంగళూరు: గౌరవ వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆశా కార్యకర్తలు కదం తొక్కారు. శుక్రవారం బెంగళూరు ఫ్రీడమ్‌ పార్కులో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోగ్య శాఖ వెన్నెముక్కగా పనిచేస్తున్న తమకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల విధులనుంచి తొలగించిన 7 వేల మంది ఆశా కార్యకర్తలను తిరిగి చేర్చుకోవాలని, ప్రస్తుతమిస్తున్న గౌరవ వేతనాన్ని పెంచాలని ఆశా కార్యకర్తల సంఘం ఉపాధ్యక్షురాలు టీసీ రమా డిమాండ్‌ చేశారు.

ఉడుపిలో

ఉప లోకాయుక్త తనిఖీలు

సాక్షి బెంగళూరు: ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప నేతృత్వంలోని అధికారుల బృందం ఉడుపిలోని పలు కార్యాలయాల్లో హఠాత్తు తనిఖీలు నిర్వహించింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి విధులకు వచ్చిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంజూరు అయిన ప్రభుత్వ భూమి కోసం వచ్చిన విశ్రాంత జవాన్‌ కష్టాన్ని లోకాయుక్త అధికారులు ఆలకించారు. సాంకేతిక దోషాలను తొలగించి వెంటనే భూమి మంజూరు చేయాలని ఆదేశించారు. సర్వే కార్యాలయంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అంతకుముందు మల్పే పోర్టులో తనిఖీలు చేపట్టారు. సముద్రంలో చేరుతున్న మురుగు నీటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మురుగునీటిలోని చేపలు దేశం మొత్తం పంపిణీ అవుతాయని, జాగ్రత్త వహించాలని సూచించారు. ఉడుపి బస్టాండ్‌ వద్ద దుకాణాల్లో లభించే ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్టాండ్‌ వద్ద శుభ్రత లేకపోవడంపై కూడా అధికారులను ప్రశ్నించారు.

గొర్రెల వ్యాపారి వద్ద రివాల్వర్‌

దొడ్డబళ్లాపురం: గొర్రెల వ్యాపారి వద్ద నుంచి సీసీబీ పోలీసులు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నివాసి సయ్యద్‌ మసూద్‌ గొర్రెల వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్ద రివాల్వర్‌ ఉన్నట్టు సమాచారం అందడంతో సీసీబీ పోలీసులు దాడి చేశారు. అతని వద్దనుంచి 0.32ఎంఎం రివాల్వర్‌తోపాటు 50లైవ్‌ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు జావేద్‌ ఆలం అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. బోపాల్‌కు చెందిన వ్యక్తి నుంచి రివాల్వర్‌ కొనుగోలు చేసినట్టు మసూద్‌ తెలిపినట్టు పోలీసులు తెలిపారు.

కేఎస్‌ఐసీ నిర్వీర్యానికి కుట్ర

సేవ్‌ మైసూరు సిల్క్‌ ఉద్యమం

ప్రారంభిస్తాం

సర్కారుపై ప్రతిపక్ష నాయకుడు

అశోక్‌ ధ్వజం

మైసూరు: మైసూరు జిల్లాలోని టీ.నరసీపురలో పట్టు కర్మాగారం ఉన్న స్థలంలో ప్రభుత్వం స్టేడియం నిర్మించడానికి ఇక్కడ ఉన్న కర్ణాటక సిల్క్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌(కేఎస్‌ఐసీ)ని నిర్వీర్యం చేసి మూసి వేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని ఆపకపోతే, సేవ్‌ మైసూరు సిల్క్‌ అనే ఉద్యమాన్ని చేపడతామని ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం మైసూరులోని ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తాను సేవ్‌ మైసూరు సిల్క్‌ ప్రచారం కోసం కర్ణాటక సిల్క్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను సందర్శించాను. ఈ కంపెనీ పట్టుకు జీఐ ట్యాగ్‌ లభించింది, ఇది మైసూరు, చామరాజనగర ప్రాంతాల ప్రతిష్టకు సంబంధించిన విషయం.‘ మహారాజా నాల్వడి కృష్ణరాజ ఒడెయర్‌ ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడ పట్టు చీరలను చూసి, స్విట్జర్లాండ్‌ నుంచి యంత్రాలను తెప్పించి ఇక్కడి పట్టు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పరిశ్రమను స్థాపించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ మైసూరు రూరల్‌ జిల్లా అధ్యక్షుడు కె.ఎన్‌.సుబ్బన్న, ఎమ్మెల్యే టీ.ఎస్‌.శ్రీవత్స, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌, మాజీ ఎంపీ ప్రతాప్‌సింహ, మైసూరు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ శివకుమార్‌, బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అనిల్‌ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు 1
1/2

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు 2
2/2

కదం తొక్కిన ఆశా కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement