అక్రమ రిసార్టులపై అధికారుల పంజా | - | Sakshi
Sakshi News home page

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా

Feb 27 2026 7:44 AM | Updated on Feb 27 2026 7:44 AM

అక్రమ

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా

రాయచూరు రూరల్‌ (గంగావతి): హంపీలో తుంగభద్రా నదీ తీరంలో అటు, ఇటు వైపు విచ్చలవిడిగా అక్రమ రిసార్టులు వెలిశాయి. వాటిలో విదేశీయుల విందు, వినోదాల రభస అధికం కావడంతో అధికారులు దృష్టి సారించారు. రిసార్టుల యజమానులపై కేసుల నమోదుకు శ్రీకారం చుట్టిన పోలీసులు, కొప్పళ జిల్లా అధికారులు గంగావతి తాలూకాలో తుంగభద్ర నదీ తీరంలో వెలసిన అక్రమ రిసార్టులపై దాడులకు ఉపక్రమించారు. తుంగా తీరంలో విదేశీయులు పోలీసుల అనుమతి లేకుండా అక్రమ కార్యకలాపాలకు పాల్పడడంతో రిసార్ట్‌ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈనెల 16న విదేశీయులు పెద్ద ఎత్తున డీజే శబ్దాలతో పాటలు పెట్టుకుని, నృత్యాలు చేస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. రిసార్ట్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా పార్టీలు చేసుకున్న అంశంపై కొప్పళ జిల్లా ఎస్పీ రామ్‌ అరసిద్ది పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు? అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు.

అనుమతి లేకుండా యథేచ్ఛగా నిర్వహణ

ఈ విషయంలో అధికారులు గంగావతి తాలూకాలోని బసాపుర, ఆనెగుంది, సణాపురలలోని 138 రిసార్ట్‌లపై జెస్కాం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఎకై ్సజ్‌, ఇతర శాఖల అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా వ్యవసాయ భూములను వ్యాపార భూములుగా చేసుకుని వాటి ఆక్రమణకు పాల్పడిన వారిపై కొరడా ఝళిపించారు. జెస్కాం అధికారులు విద్యుత్‌ మీటర్లు, వైర్లు తొలగించగా, పంచాయతీ అధికారులు తాగునీటి కనెక్షన్లు తొలగించారు. రెవెన్యూ అధికారులు అక్రమ రిసార్టులకు తాళాలు వేశారు. కొప్పళ తాలూకాలో ఉన్న 150 రిసార్టుల్లో అక్రమంగా 98, గంగావతి తాలూకాలో ఉన్న 50 రిసార్టుల్లో అక్రమంగా 40 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రిసార్టులపై దాడులకు తహసీల్దార్‌ విశ్వనాథ్‌, టీపీ ఈఓ రామిరెడ్డి పూనుకున్నారు.

138కి పైగా అక్రమ రిసార్టులపై దాడులు

హొసపేటె: కొప్పళ, గంగావతి తాలూకాలోని అనధికార, అక్రమ రిసార్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాధికారి సురేష్‌ హిట్నాళ్‌ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బసాపుర, ఆనెగుంది, సణాపుర ప్రాంతాల్లోని రిసార్ట్‌లపై దాడులు చేశారు. జెస్కాం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఎకై ్సజ్‌ వంటి వివిధ శాఖల అధికారుల నేతృత్వంలోని బృందాలు కొప్పళ తాలూకాలోని బసాపుర, గంగావతి తాలూకాలోని ఆనెగుంది, సణాపురలలో అనధికార రిసార్ట్‌లపై దాడులు చేశాయి. దాడుల సమయంలో కొన్ని చోట్ల ఏ శాఖ నుంచి అనుమతి పొందకుండా, వ్యవసాయ భూమిని వాణిజ్య ఉపయోగం కోసం మార్చకుండా అదే స్థలంలో రిసార్ట్‌లను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే నిబంధనలు ఉల్లంఘించిన రిసార్ట్‌లకు రెవెన్యూ శాఖ అధికారులు తాళాలు వేశారు. జెస్కాం విభాగ సిబ్బంది విద్యుత్‌ కనెక్షన్‌ను, మీటర్లను తొలగించగా, పంచాయతీ వాటర్‌మెన్‌ నీటి కనెక్షన్‌ను తొలగించారు.

హంపీ వద్ద నదీ తీరంలో వెలసిన రిసార్టులు

హంపీలో రిసార్టు వద్ద పర్యాటకుల సందడి

రిసార్ట్‌ వద్ద అధికారుల తనిఖీ తాళం వేసి సీల్‌ చేసిన దృశ్యం

తుంగభద్ర నదీ తీరంలో

విదేశీయుల పార్టీలు

40 రిసార్ట్‌లకు తాళాలు వేసిన అధికారులు

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా1
1/2

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా2
2/2

అక్రమ రిసార్టులపై అధికారుల పంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement