భీమా నదిలో పడి బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

భీమా నదిలో పడి బాలిక మృతి

Feb 27 2026 7:44 AM | Updated on Feb 27 2026 7:44 AM

భీమా

భీమా నదిలో పడి బాలిక మృతి

రాయచూరు రూరల్‌: భీమా నదిలో పడి ఓ బాలిక మరణించిన ఘటన బుధవారం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వడగేర తాలూకాలోని బెనకహళ్లి వద్ద నదిలో తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన మరెమ్మ(7) అనే బాలిక ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. జోళదడిగి నివాసి అయిన బాలిక గ్రామ దేవత జాతరకు వచ్చింది. బట్టలు ఉతకడానికి తల్లితో కలిసి వెళ్లిన మరెమ్మ మొబైల్‌ చూసుకుంటూ ఏమరుపాటున నదిలో పడిపోయింది. వెంటనే తల్లి కేకలు పెట్టడంతో గ్రామస్తులు వచ్చి రక్షించి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈ ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిజర్వేషన్‌ ప్రకటించే వరకు నియామకాలు తగదు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణలు, రిజర్వేషన్‌ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశాలు కల్పించడం తగదని కర్ణాటక చలువాది మహాసభ సంచాలకుడు రవీంద్రనాథ్‌ పట్టి డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదికల ఆధారంగా రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగాల్లో నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంకు జిల్లాధికారి నితీష్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నరసింహులు, భాస్కర్‌, హనుమంతులున్నారు.

అదనపు గదులు నిర్మించరూ

రాయచూరు రూరల్‌: నగరంలోని మడ్డిపేట ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నివాసులు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నరసింహులు మాట్లాడారు. 1951లో నిర్మించిన గదులు నేడు శిథిలావస్థకు చేరుకోగా, వాటి స్థానంలో నూతనంగా పాఠశాల గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. 300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, గదులు అధ్వాన స్థితికి చేరుకున్నాయని అధికారులు నివేదిక పంపినా నేటికీ అధికారులు మౌనం వహించారని, వెంటనే నూతన గదుల నిర్మాణం చేపట్టాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. శివకుమార్‌, వీరేష్‌, చిన్నయ్య స్వామి, శంకర్‌, మోహన్‌ రెడ్డి, బసవరాజ్‌, అనిల్‌, నాగరాజ్‌, శ్రీనివాస రెడ్డి, నరేంద్ర, లక్ష్మికాంత్‌, జంబన్నలున్నారు.

మౌలిక సౌకర్యాల కోసం ధర్నా

రాయచూరు రూరల్‌: సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ హాస్టల్‌ విద్యార్థులు ఆకస్మికంగా ధర్నాకు దిగారు. బుధవారం రాత్రి రాయచూరులోని బిజనగేర రహదారిలో గల హాస్టల్‌లో విద్యార్థులకు సక్రమంగా పడుకోవడానికి పడకలు, దుప్పట్లు, తాగునీటి సమస్య, వేడినీరు ఇవ్వకుండా చల్లని నీటితో స్నానం చే యాలని వార్డెన్‌ హెచ్చరిస్తూ దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. దినపత్రికలు లేవని, కంప్యూటర్‌ చెడిపోయిందని, క్రీడా సామగ్రిని ఇవ్వకుండా దాచి పెడుతుండడాన్ని ఖండించారు.

రాఘవేంద్రస్వామికి పూజలు

శివాజీనగర: హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం బద్రీనాథ్‌ ఆచార్య, సుబ్రహ్మణ్య ఆచార్య, సర్వ స్వామి నేతృత్వంలో బృందావనానికి పూజలు నిర్వహించారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు మంజునాథ్‌ శెట్టి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి హస్తాక్షర అష్టాక్షర జపం పారాయణాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పురసభ అధ్యక్షుడు మరిరామప్ప, భజన మండలి అధ్యక్షులు ఎంఎం సావిత్రి పాల్గొన్నారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో కోట ఎల్లమ్మ ఆలయ 112వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు జగదేనహళ్లి రాఘవేంద్రస్వామి నేతృత్వంలో అమ్మవారిని పూలతో అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

భీమా నదిలో పడి బాలిక మృతి1
1/4

భీమా నదిలో పడి బాలిక మృతి

భీమా నదిలో పడి బాలిక మృతి2
2/4

భీమా నదిలో పడి బాలిక మృతి

భీమా నదిలో పడి బాలిక మృతి3
3/4

భీమా నదిలో పడి బాలిక మృతి

భీమా నదిలో పడి బాలిక మృతి4
4/4

భీమా నదిలో పడి బాలిక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement