కాఫీ తోటలో ఏనుగు దాడి | - | Sakshi
Sakshi News home page

కాఫీ తోటలో ఏనుగు దాడి

Feb 23 2026 6:57 AM | Updated on Feb 23 2026 6:57 AM

కాఫీ

కాఫీ తోటలో ఏనుగు దాడి

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా కాండ్య హొబళి హుణసెహళ్లి గ్రామంలో ఆదివారం ఉదయం అడవి ఏనుగు దాడి చేసి కూలీ మహిళను చంపివేసింది. వారం రోజుల్లో ఏనుగు దాడిలో మరొకరు మరణించారు. విజయనగర జిల్లా కూడ్లిగికి చెందిన కామయ్యనట్టి బోరమ్మ (33), భర్త, ఇద్దరు పిల్లలతో కాఫీ తోటల్లో కూలీ పని కోసం వచ్చింది. కాఫీ తోటలో పని చేస్తుండగా ఓ ఏనుగు వెంటాడి ఆమెను కాళ్లతో తొక్కి చంపేసింది. కూలీలు, చుట్టుపక్కల గ్రామస్థులు ఆగ్రహం పట్టలేక ఆమె మృతదేహాన్ని కాఫీతోటలోంచి బయటకు తెచ్చి జాతీయ రహదారిలో ఉంచి ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాలను అడ్డుకున్నారు. అటవీశాఖ మంత్రి తక్షణం వచ్చి న్యాయం చేయాలని పట్టుబట్టారు. గొడవలు జరగకుండా అదనపు ఎస్పీ జయకుమార్‌, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కుంకీ ఏనుగులతో కూంబింగ్‌

ఈ నెల 16న ఏనుగు దాడిలో హావేరికి చెందిన యల్లప్ప అనే కార్మికుడు మృతి చెందాడు. శృంగేరి ఎమ్మెల్యే టిడి రాజేగౌడ సూచన మేరకు అటవీ అధికారులు కుంకీ ఏనుగులతో రౌడీ ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బెరణగోడు సమీపంలోని కెరెమనె వద్ద ఓ పెద్ద అడవి ఏనుగును మత్తు మందు కొట్టి బంధించారు. దానిని దూరంగా తరలిస్తామని చెప్పారు.

మహిళా కూలీ మృత్యువాత

చిక్కమగళూరు జిల్లాలో విషాదం

కాఫీ తోటలో ఏనుగు దాడి1
1/3

కాఫీ తోటలో ఏనుగు దాడి

కాఫీ తోటలో ఏనుగు దాడి2
2/3

కాఫీ తోటలో ఏనుగు దాడి

కాఫీ తోటలో ఏనుగు దాడి3
3/3

కాఫీ తోటలో ఏనుగు దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement