అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు | - | Sakshi
Sakshi News home page

అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

అల్లు

అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు

మండ్య: యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్‌, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్‌ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు.

డబ్బు, బంగారం బూడిద..

కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫర్నిచర్‌, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్‌ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు, క్లూస్‌ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్‌ కుమార్‌, సీఐ నవీన్‌ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది.

కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని

ఓ మామ ఘాతుకం

మండ్య వద్ద అకృత్యం

అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు 1
1/1

అల్లుని ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement