మహాత్మా గాంధీకి ఘన నివాళి
రాయచూరు రూరల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అధ్యక్షుడు శాంతప్ప మాట్లాడుతూ.. శాంతి, సత్యాగ్రహాల మార్గంలో గాంధీజీ బ్రిటిష్ వారిని ఎదిరించి, ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అహింసా సిద్ధాంతం దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పోరాట యోధులకు స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బసవ రాజ్ పాటిల్, శ్రీదేవి, ప్రేమలత, మంజళ, వందన పాల్గొన్నారు.


