వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు
బళ్లారి అర్బన్: వేసవి కాలంలో నగర ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పి.గాద్దెప్ప అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని నారాయణ రావ్ పార్కులో నగరంలోని అన్ని వార్డులకు సంబంధించిన వాల్‌మ్యాన్‌లు, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తాగునీటి పైప్‌లైన్ లీకేజీలతో నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో నీటి సమస్య ఏర్పడితే వెంటనే సంబంధిత ఇంజనీర్లకు సమాచారం ఇచ్చి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తక్షణమే మరమ్మతులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


