కొప్పళ జిల్లాలో లోకాయుక్త దాడులు
హొసపేటె: కొప్పళ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున లోకాయుక్త అధికారులు మెరుపు దాడి చేశారు. అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో కిమ్ ఆస్పత్రి నిర్వాహకుడు బి.కల్లేష్‌కు చెందిన ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పలు పత్రాలను పరిశీలించారు. కొప్పళ తాలూకా భాగ్యనగర్‌లోని బి.కల్లేష్ నివాసం, అతడి అత్తగారి ఇల్లు, నవచేతన పాఠశాల, సైన్స్ కళాశాల, యలబుర్గా తాలూకాలోని చిక్క మన్నాపుర గ్రామంలోని ఇంటిపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు.


