దర్శన్‌ను చూసిన పోలీసు... వార్డర్‌కు బదిలీ కానుక
బొమ్మనహళ్లి: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రముఖ నటుడు దర్శన్ రిమాండులో ఉండగా, తరచూ ఏదో ఓ సంఘటన బయటకు వస్తోంది. తాజాగా ఓ జైలు అధికారి బదిలీ అయ్యాడు. దీనికి కారణం.. ఓ కానిస్టేబుల్ దర్శన్‌ను దర్శించుకోవడమే.
ఎలా జరిగింది?
వివరాలు.. ఈ ఘటనలో జైలు వార్డర్ ప్రభుశంకర్ చౌహాన్‌ను చామరాజనగర జిల్లా జైలుకు బదిలీ చేసి, తనిఖీకి ఆదేశించారు. ఇంతకూ ఏమైందంటే.. యలహంక పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ఇటీవల ఓ నిందితున్ని జైలులోకి వదలడానికి వచ్చాడు. ఈ సమయంలో తాను దర్శన్‌ను చూస్తానంటూ వార్డర్ చౌహాన్ వద్ద ఉబలాటపడ్డాడు. సరేనంటూ చౌహాన్ అక్కడి సీసీ టీవీ కెమెరాలను బంద్ చేసి మరీ నటుడు దర్శన్‌ను కానిస్టేబుల్‌కు చూపించారు.
జైళ్ల చీఫ్ సీరియస్
ఈ విషయం జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్ దృష్టికి వచ్చింది. ఖాకీ దుస్తులు ధరించిన ఎవరో దర్శన్ బ్యారక్ వద్దకు వచ్చి వెళ్లిపోయారు అని ఆయనకు తెలిసింది. విచారణ చేయగా వార్డన్ చౌహాన్, కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. దీంతో వార్డర్‌ను మరో జైలుకు బదిలీ చేసి అతని పనితీరుపై విచారణ ప్రారంభించారు. కానిస్టేబుల్‌పై కూడా చర్యలు తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
నటుడు దర్శన్ (ఫైల్)
పరప్పన చెరసాలలో నిర్వాకం


