కోలారు: ఈ నెల 31 వ తేదీ నగరంలో బృహత్ హిందూ సమాజోత్సవం నిర్వహిస్తున్న తరుణంలో గురువారం సన్నాహకంగా వందలాది హిందూ కార్యకర్తలు బైక్ ర్యాలీ జరిపారు. జూనియర్ కళాశాల మైదానంలో నుంచి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వివిధ కూడళ్ల గుండా సాగుతూ తిరిగి కళాశాల మైదానికి చేరుకుంది. అందరూ సమాజోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంతటా కేసరి బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడంతో కోలారు కాషాయమయంగా మారింది.


