లక్కుండి నిధుల తల్లి, కుమారునికి సన్మానం
హుబ్లీ: గదగ్ జిల్లా లక్కుండిలో పాత ఇంటిలో పునాది తవ్వుతుండగా రాగి కలశంలో 466 గ్రాముల బంగారు ఆభరణాలు లభించడం తెలిసిందే. ఆ నిధిని అప్పగించిన బాలుడు ప్రజ్వల్ రిత్తి, అతని తల్లిని సన్మానించారు. గదగ్‌లో గణతంత్ర సంబరాలలో మంత్రి హెచ్‌కే పాటిల్ బాలుడు, తల్లి కస్తూరవ్వని సత్కరించి ప్రశంసించారు. ఆ కుటుంబానికి ఇల్లు, తల్లికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా అన్ని సహాయాలను అందిస్తామని చెప్పారు. లక్కుండి ప్రాచీన వైభవ పరిరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి
● మండ్యలో భారీ నిరసన
మండ్య: ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో రైతు సంఘం, కన్నడ సంఘాల నేతలు, కార్యకర్తలు గణతంత్ర దినోత్సవ వేళ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కేపిఎస్, మాగ్నెటిక్ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం అనేక పాఠశాలలను మూసివేస్తోందని మండ్య నగరంలోని జయచామరాజేంద్ర సర్కిల్‌లో గుమిగూడారు. మంత్రి చెలువరాయస్వామికి వినతిపత్రం ఇవ్వాలని విశ్వేశ్వరయ్య స్టేడియానికి పాదయాత్రకు బయల్దేరారు. పోలీసులు వెస్ట్ పోలీస్ స్టేషన్ ముందు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి, ప్రభుత్వ విద్య పూర్తిగా ప్రైవేటీకరించబడుతోంది అని నిరసనకారులు నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు ప్రజలను దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. త్రిభాషా సూత్రానికి బదులుగా ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేతలు ఇందువాల చంద్రశేఖర్, శివల్లి చంద్రు, ప్రకాష్, కీలఘట్ట నంజుండయ్య, ప్రభులింగ, రామలింగగౌడ పాల్గొన్నారు.
లక్కుండి నిధుల తల్లి, కుమారునికి సన్మానం


