కార్యవర్గం ఎంపిక
బళ్లారిటౌన్: కన్నడ రక్షణ వేదికె కావలు పడె నూతన కార్యవర్గాన్ని సోమవారం కమ్మరచేడు మఠం కళ్యాణ స్వామి సారధ్యంలో ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.సురేష్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా కుడితిని నరసింహరాజు, రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలుగా వీఎం బంగోరి లక్ష్మీప్రియ, వివిధ వార్డుల అధ్యక్షులను కూడా నియమించినట్లు తెలిపారు. గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ నావల్కర్, బీదర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ బుదర్కర్, యువశాఖ అధ్యక్షుడు వీఎస్.నాగప్ప, నగర అధ్యక్షుడు అమిత్, ఉపాధ్యక్షుడు షేక్, శ్రీకాంత్, ఎస్పీ సర్కిల్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు.


