
మలె మహదేశ్వరునికి కనకవర్షం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రక్యాత మలె మహదేశ్వర బెట్టలో వెలసిన మలెమహదేశ్వర స్వామి దేవస్థానం చరిత్రలో మొదటిసారిగా 35 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.3.26 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గురువారం సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శాంతమల్లికార్జున స్వామీజీ సమక్షంలో దేవస్థానంలోని హుండీల లెక్కింపు జరిగింది. ఈసారి ప్రభుత్వ సెలవు రోజులు, పాదయాత్రికులు, ఉగాది, అమావాస్య జాతర మహోత్సవం, తేరు వేడుకలు ఎక్కువగా జరిగాయి దీంతో వేల పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానాన్ని సందర్శించి కానుకలు సమర్పించారు. రూ.3.26 కోట్ల నగదు, 47 గ్రాముల బంగారం, 2.2 కేజీల వెండి సొత్తు లెక్కతేలాయి. ఈ–హుండీ ద్వారా రూ.59 వేలు, 11 విదేశీ కరెన్సీ నోట్లు, చలామణిలో లేని 20 రూ.2 వేల నోట్లను హుండీలో వేశారు. 35 రోజుల్లో రూ.3.26 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించడం ఇదే ప్రథమమని ఆలయ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి ఏఈ రఘు తెలిపారు. ప్రాధికార ఉప కార్యదర్శి చంద్రశేర్ పాల్గొన్నారు.
మలె మహదేశ్వర దేవస్థానం
35 రోజుల్లో 3.26 కోట్ల హుండీ ఆర్జన