హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనంలో సంచరించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ అరుణాంగ్షు గిరి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద హెల్మెట్ జాగృతి జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాల బారి నుంచి రక్షణ పొందడానికి హెల్మెట్ ధరించాలన్నారు. జాతాలో డీఎస్పీ శాంతవీర, అధికారులు సాబయ్య, ఉమేష్ కాంబ్లే, మంజునాథ్, వెంకటేష్, నరసమ్మ, మహేష్ పాటిల్, ఈరేష్ నాయక్, వివిధ శాఖల ఉద్యోగులు, ిసిబ్బంది పాల్గొన్నారు.
కురుబలను అగౌరవ పరచొద్దు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కురుబ కులస్తులను అగౌరవ పరచడం తగదని కోడిమఠం స్వామీజీ డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ వెల్లడించారు. మంగళవారం దేవదుర్గ తాలూకా తింథిణి వంతెన వద్ద కాగినెలె కనక గురు పీఠంలో ఏర్పాటు చేసిన హాలుమత సాహిత్య ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. శివ పార్వతి పుత్రులు కురబలన్నారు. కురుబ సమాజం వారికి అధికారం లభిస్తే త్వరగా వదలరని వివరించారు. కురుబలను కుర్చీ నుంచి దింపడం కష్టమని తానే పదవిని వదులుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జల, అగ్ని ప్రళయాలు సంభవించి మిలియన్ స్థాయిలో మరణాలు సంభవిస్తాయన్నారు. 2025 కంటే 2026లో పది రెట్ల మేర అపాయం ఉందన్నారు. దేశంలో ఇద్దరు పెద్ద నాయకులు మరణిస్తారన్నారు. కార్యక్రమంలో నిరంజనానంద, సిద్దరామానంద, నికేత రాజ్, చంద్రశేఖర్, హళ్లికేరి, చంద్రకాంత్, గుండప్ప, రేవణ్ణ, మంజునాథ్‌లున్నారు.
మహనీయుల ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్ : ప్రతి ఒక్కరూ మహనీయుల ఆదర్శాలను అనుసరించాలని కన్నడ సాహిత్య పరిషత్ కార్యదర్శి దండెప్ప బిరాదార్ అన్నారు. మంగళవారం తాలూకాలోని ఉడుమగల్ ఖానాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిని ఆచరించి మాట్లాడారు. శరణుల తత్వాలను జీవితంలో అలవరచుకోవాలన్నారు. సమాజంలో నలుగురికి ఉపయోగ పడేలా బాటలు వేసుకోవాలన్నారు. సరస్వతి, శివలీల, పాండురంగ, వీరేష్, నీలకంఠ, వీణ, గీతాలున్నారు.
మంటల్లో అడవి బుగ్గి
హొసపేటె: నగర శివార్లలో జాతీయ రహదారి– 50కి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగి విస్తృతంగా వ్యాపించాయి. వ్యాసనకెరె సమీపంలోని కొండకు కొంత మంది దుండగులు నిప్పంటించిన ప్రభావం మొదట్లో తక్కువగా ఉంది. తరువాత మంటలు కొండ అంతటా వ్యాపించాయి. హైవోల్టేజ్ విద్యుత్ లైన్ స్తంభాలు అదే ప్రాంతం గుండా వెళ్లాయి. పవన విద్యుత్ ఫ్యాన్లు కూడా పని చేస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది సందర్శించి మంటలను ఆర్పే పనుల్లో నిమగ్నులయ్యారు.
మోసకారి వ్యక్తిని
అరెస్ట్ చేయాలి
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని సమాజ సేవకుడు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం హెచ్‌ఐఎస్ అకాడమీ నాగరాజ్ అనే వ్యక్తి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందడానికి ప్రశ్న పత్రాలు, స్కాలర్‌షిప్‌లు అందిస్తామని, రూ.2,500 చెల్లించాలని కోరారన్నారు. సంస్థ పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి లక్షల్లో నిధులు దిగమింగాడని, అలాంటి వ్యక్తి వ్యామోహంలో పడి వంచనకు గురి కాకుండా నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నేటి నుంచి మైలార ఉత్సవాలు
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా మైలారలో వెలసిన, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన మైలార లింగేశ్వరుడి ఉత్సవాలు బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కురబ, యాదవుల కులదైవం, బండారు(పసుపు)సమర్పణలో తలమునకులైన భక్తులు దేవుడిని ఊరేగిస్తారు. నాగ పూజలు జరిపి నాగోళి రోజున బహు పరాక్ అంటూ నినాదాలు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ


