లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
హొసపేటె: తాలూకాలోని ధర్మసాగర శివార్ల సమీపంలో సోమవారం రాత్రి లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన జరిగింది. మృతుడిని సంజయ్(40)గా గుర్తించారు. జిందాల్ నుంచి పుణె వైపు లారీ నడుపుతున్నాడని చెబుతున్నారు. ధర్మసాగర గ్రామంలోని జాతీయ రహదారి–67పై ఒక లారీ ఆగి ఉంది. నిన్నటి నుంచి ఆగి ఉన్న లారీని చూసిన స్థానికులు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే గాదిగనూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాపు నిర్వహించి డ్రైవర్ మృతి చెందినట్లు నిర్ణయించారు. మృతుడు సంజయ్ పుణె నివాసి అని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తరువాత సంజయ్ మృతదేహాన్ని హొసపేటె ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు.
29 నుంచి ఎడెదొరెనాడు జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలో ఈనెల 29 నుంచి 21 మూడు రోజుల పాటు జరగనున్న రాయచూరు జిల్లా ఎడెదొరె నాడు ఉత్సవాలకు ప్రతిఒక్కరూ సిద్ధం కావాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈసారి జిల్లా ఉత్సవాల్లో సాంస్కృతిక కళల ప్రదర్శనలకు సిద్ధం కావాలన్నారు. ఉత్సవాల్లో అందరూ చురుకుగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఏసీ హంపన్న, డీఎస్పీ శాంతవీర, తహసీల్దార్ సురేష్‌వర్మ, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, పవన్ పాటిల్, నాగేంద్రప్ప, చంద్రశేఖర్‌లున్నారు.
సమాజ సేవకు పదవులు ముఖ్యం కాదు
రాయచూరు రూరల్: సమాజంలో విద్యా, రాజకీయ, సామాజిక, ధార్మిక సేవలకు పదవులు ముఖ్యం కాదని, మనస్సుకు మార్గముంటే ఏ సేవ చేయడానికై నా సిద్ధం కావాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరక్టర్ రాజన్న పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని బసవ విద్యా నికేతన్ పాఠశాలలో స్వామి వివేకానంద జయంతిలో పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సమాజ సేవలందించిన మహోన్నత వ్యక్తి వివేకానంద చిరస్మరణీయుడన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. లలిత, బసనగౌడ, రావుత్‌రావ్, ఆంథోని, శారదలున్నారు.
కాల్పుల ఘటనపై దర్యాప్తు షురూ
సాక్షి,బళ్లారి: ఈనెల 1న ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి స్వగృహం వద్ద జరిగిన రగడ, కాల్పుల నేపథ్యంలో సతీష్‌రెడ్డి గన్‌మెన్ గురుచరణ్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలిన నేపథ్యంలో ఈ కేసును సీఐడీ దర్యాప్తునకు అప్పగించారు. మూడు రోజుల క్రితం సీఐడీ ఎస్పీ హర్ష బళ్లారికి వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మంగళవారం సీఐడీ ఏడీజీపీ బీ.కే.సింగ్ బళ్లారికి విచ్చేసి సంబంధిత పోలీసు అధికారులతో వివరాలు సేకరించారు. సీఐడీ ఎస్పీ హర్ష బ్రూస్‌పేట పోలీసు అధికారులతో మాట్లాడి కేసు వివరాలను తెలుసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
శుభ్రతకు అందరూ సహకరించాలి
రాయచూరు రూరల్: నగరంలోని ఆలయాల శుభ్రతకు అందరూ సహకరించాలని బిల్వ మందిరం అధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం శ్రీకృష్ణ దేవరాయ కాలనీలో వెలసిన బిల్వ మందిరం శుభ్రతకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. పరిసరాలను సంరక్షించి సుందరంగా తీర్చిదిద్దడానికి ముందుకు రావాలన్నారు. ప్రజలు శుభ్రతపై మొగ్గు చూపాలని కోరారు. అనసూయ, లలిత, సువర్ణ, రవి శంకర్, రాజశేఖర్, అంబరీష్, వెంకటేష్, శరణప్ప, సుమాలున్నారు.
లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
లారీ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి


