ప్రభుత్వ పథకాల లబ్ధి పొందండి
హొసపేటె: జిల్లాలోని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో అత్యంత అణగారిన వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఎంపీ ఈ.తుకారాం అన్నారు. నగరంలోని జిల్లా స్టేడియంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ, అలీన్కో ఆధ్వర్యంలో విజయనగర జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వైకల్యాన్ని శాపంగా భావించే బదులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, విజయవంతమైన జీవితాన్ని గడపాలన్నారు. జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ తిమ్మప్ప, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్‌కుమార్, హుడా కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, వివిధ శాఖల, జిల్లా, తాలూకా స్థాయి అధికారులు, ఎన్నికై న సభ్యులు పాల్గొన్నారు.


