ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
బళ్లారిటౌన్: మన దేశంలో ప్రతిభావంతులకు తగిన వేదిక, శిక్షణ లభించాల్సి ఉందని, అప్పుడే మన పరంపర మోస్తున్న సంస్కృతిపై కూడా యువతలో అవగాహన కలుగుతుందని గదగ్ విజయపుర రామకృష్ణ వివేకానంద ఆశ్రమం అధ్యక్షుడు స్వామి నిర్భయానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పత్రికా భవనంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మన దేశంలో నేటి విద్యా పద్ధతి ఫలితాలపైనే దృష్టి సారించింది కానీ వారి జీవితం విధానాలను నేర్పడం లేదన్నారు. సంఘం అధ్యక్షుడు వీరభద్రగౌడ తదితరులు పాల్గొన్నారు.


