
అష్ట భుజ వెండి కవచ అలంకరణలో బనశంకరి దేవి
రాయచూరు రూరల్: దీపావళిని పురస్కరించుకొని బనశంకరి దేవికి 500 కేజీల వెండి అష్టభుజ కవచాలను అలంకరించారు. మంగళవారం గదగ్ జిల్లా బెటగేరిలో వెలసిన బనశంకరి దేవికి బలిపాడ్యమి రోజున దేవాంగ తరుణ్ సేవాదళ్, దేవాంగ సమాజం, బనశంకరీ ట్రస్ట్ సభ్యుల సహకారంతో అభిషేకం, అష్ట భుజ వెండి కవచ ప్రత్యేక అలంకరణను చేసి ప్రత్యేకంగా ఊరేగించారు.
మంత్రాలయంలో విశేష పూజలు
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ విశేష పూజలు చేశారు. మంగళవారం బలిపాడ్యమి సందర్భంగా ఆయన భక్తుల సమక్షంలో మూల రామ దేవుడికి అభిషేకం, ఇతర పూజలను నిర్వహించారు.

మంత్రాలయంలో విశేష పూజలు చేస్తున్న సుబుదేంద్ర తీర్థులు