నన్ను గెలిపిస్తే అష్టలక్ష్మి మీ ఇంట కొలువైనట్లే: గాలి లక్ష్మీ అరుణ

- - Sakshi

సాక్షి,బళ్లారి: ఇంటి ఆడచులా భావించి తనను గెలిపించాలని కేఆర్‌పీపీ బళ్లారి నగర అభ్యర్థిని గాలి లక్ష్మీ అరుణ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజైన సోమవారం ఆమె నగరంలో పలు వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. నా పేరు గాలి లక్ష్మీ అరుణ, ఈవీఎంలో నా క్రమ సంఖ్య–8, ఇది అష్టలక్ష్మీలకు సంకేతం, తనను గెలిపిస్తే ప్రతి ఇంటా సమస్యలు తీర్చేందుకు అష్టలక్ష్మీల ఆశీర్వాదం ఉంటుందని ఓటర్లకు సూచించారు. 30 సంవత్సరాల క్రితం గాలి జనార్దనరెడ్డి సతీమణీగా బళ్లారికి వచ్చానని, ఇంటికి పరిమితమైన తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు.

ఎమ్మెల్యే కావాలనుకుంటే భర్త గాలి జనార్దనరెడ్డి ప్రోత్సాహంతో ఎప్పుడో అసెంబ్లీలోకి కాలుపెట్టే భాగ్యం కలిగేదన్నారు. రాజకీయ కుట్రతో తన భర్తను 12 సంవత్సరాలు వనవాసం చేయించారని, ఆయన ఆశయ సాధనలు, బళ్లారి ప్రజల కన్నీరు తుడిచేందుకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అనివార్యమైందన్నారు. తమ కుటుంబానికి భగవంతుడు అన్ని ఐశ్యర్యాలు ఇచ్చారన్నారు.

ఒక రూపాయి కూడా ప్రజాధనాన్ని తాము తీసుకోకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మీ ఆశీస్సులు అందించి ఫుట్‌బాల్‌ గుర్తుకు ఓటెసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఆమెకు జనం బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో కేఆర్‌పీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వీ. శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి కుమార్తె బ్రహ్మణీ, కార్పొరేటర్లు కే.ఎస్‌ ఆశోక్‌,కోనంకి తిలక్‌, మాజీ మేయర్‌ వెంకటరమణ, నాయులు సంజయ్‌ బెటగేరి పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top