ప్రజలతో పోలీసులు జనస్నేహిగా మెలగాలి
రాయచూరు రూరల్: నేటి సమాజంలో ప్రజలతో పోలీస్ అధికారులు జనస్నేహిగా మెలగాలని ఎస్పీ అరుంణాగ్షు గిరి సూచించారు. బుధవారం సింధనూరు డీఎస్పీ కార్యాలయంలో జన సంపర్క సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేరాల నియంత్రణ, గంజాయి, హఫీం, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా సీహెచ్ పౌడర్, కల్తీ కల్లు, ఇతరత్ర వంటి వాటిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, పీఐ వీరనగౌడ, మౌనేష్‌లున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలి
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్సఫార్మర్‌ను తొలగించాలని నవరత్న యువక సంఘం డిమాండ్ చేసింది. బుధవారం తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణప్ప మాట్లాడారు. పాఠశాల ఆవరణ సమీపంలో ఏర్పాటు చేసినందు వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని, విద్యాశాఖాధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
అంగన్‌వాడీలను
పర్మినెంట్ చేయరూ
రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం లింగసూగూరు తాలూకా సీడీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు సరస్వతి మాట్లాడారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర సర్కార్‌లు ముందుకురావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం నిష్పత్తిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ సీడీపీఓ నాగరత్నకు వినతిపత్రం సమర్పించారు.
సైక్లింగ్ జాతాకు
సహకరించాలి
రాయచూరు రూరల్ : నగరంలో సైక్లింగ్ జాతా, జిల్లా ఉత్సవాలకు అందరూ సహకరించాలని పంచ గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు పవన్ పాటిల్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో నగరసభ ఏర్పాటు చేసిన సైక్లింగ్ మ్యారథాన్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. యువకులు ముందుకు రావాలని, కేవలం ప్రచారం కోసం మారథాన్ నిర్వహించడం సబబు కాదన్నారు. మారథాన్‌లో గెలుపొందిన క్రీడాకారులు బెల్లం ప్రకాష్, రాఘవేంద్ర, వీరేష్ సాధించారు. ర్యాలీలో ఏడీసీ శివానంద, ఏసీ హంపన్న, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్‌రాణిలున్నారు.
నైరుతి రైల్వేకు
రూ.7 వేల కోట్ల రాబడి
హుబ్లీ: నైరుతి రైల్వేకు రూ.7 వేల కోట్ల భారీ ఆదాయం సమకూరిందని జోన్ జీఎం ముకుల్ శరణ్ మాథుర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నైరుతి రైల్వే రూ.69.39 కోట్ల మేర మొత్తం ఆదాయం గడించింది. ప్రయాణికుల విభాగం రికార్డు స్థాయిలో రూ.25.43 కోట్లు, సరకు రవాణాలో డిసెంబర్ అవధి వరకు రికార్డు స్థాయిలో రూ.39.76 కోట్ల ఆదాయం గడించిందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా 482 ప్రత్యేక రైలు సర్వీసులు 614 అదనపు బోగీల సౌకర్యం కల్పించాం. భద్రత కోసం 3692 కిలోమీటర్ల పరిధిలో కవాచ్ ఏర్పాటుకు అనుమతినిచ్చాము. రెండు వందేభారత్ రైళ్లతో పాటు 10 కొత్త రైళ్లు సేవలు ప్రారంభించాయని తెలిపారు. మేరీ సహేలీ యోజన ద్వారా 3.3 లక్షల మంది మహిళా ప్రయాణికులకు చేదోడుగా నిలిచింది. నిఘా వ్యవస్థ కోసం 164 స్టేషన్లలో 2129 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలతో పోలీసులు జనస్నేహిగా మెలగాలి
ప్రజలతో పోలీసులు జనస్నేహిగా మెలగాలి
ప్రజలతో పోలీసులు జనస్నేహిగా మెలగాలి


