రైతులపై అభిమానం ఉన్నవారు నేరుగా వారి వద్దే బియ్యం కొనుగోలు చేయాలి. వినియోగదారులు గ్రూ పులుగా ఏర్పడి రైతులను సంప్రదిస్తే, వారు బియ్యం పట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కొనుగోలు దారులు దొరుకుతారో లేదోనన్న సందేహంతోనే చాలా మంది రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు.
– గడ్డం సత్యనారాయణరెడ్డి,
జిల్లా ఉత్తమ రైతు, నాగారం
వినియోగదారులు ఆదుకోవాలి
రైతులు పండించిన బియ్యాన్ని నేరుగా కొనుగోలు చేయడం ద్వారా వారికి అండగా నిలవాలి. రైస్‌మిల్లులు, దుకాణాల కంటే నమ్మకమైన రైతు వద్ద బియ్యం కొనుగోలు చేయడంలో ప్రత్యేక తృప్తి ఉంటుంది.
– దన్నపునేని అశోక్‌కుమార్,
రిటైర్డ్ జిల్లా వ్యవసాయాధికారి


