తమ్ముడి మానసిక స్థితి భరించలేక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తమ్ముడి మానసిక స్థితి భరించలేక ఆత్మహత్య

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కలవేన నరేశ్‌(38) గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తమ్ముడి మానసికస్థితి బాగో లేకపోవడం, ఇంట్లో ఒంటరినయ్యాననే బెంగతో మద్యానికి బానిసైన నరేశ్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రూరల్‌ ఎస్సై మధుకర్‌ తెలిపారు. మృతుడి సోదరి ఎద్దు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.

కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని

నమ్మించి డబ్బులు వసూలు

● నిందితుడి అరెస్ట్‌

జ్యోతినగర్‌: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌లో మ్యాన్‌పవర్‌ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ.25 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన అంబటి నరేశ్‌ యాదవ్‌ను శుక్రవారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బాధితుడు ముప్పు సురేశ్‌ నుంచి రూ.20 లక్షలు తీసుకుని, మరో రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశాడు. అయినా కాంట్రాక్ట్‌ ఇప్పించకపోవడంతోపాటు, డబ్బులు తిరిగి ఇ వ్వావలని అడిగిన బాధితుడిని అసభ్య పదజా లంతో దూషించి, చంపుతానని బెదిరించా డు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చే శాడు. ఎస్సై వెంకటస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు అంబటి నరేశ్‌ యాదవ్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

ఆర్టీసీ బస్సు–ట్రాక్టర్‌ ఢీ

● ముగ్గురికి తీవ్ర గాయాలు

తిమ్మాపూర్‌: మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద శుక్రవారం గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్ర యాణికులు ఉండగా, కొందరికి గాయాలయ్యా యి. ఆర్టీసీ డ్రైవర్‌, ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

గంజాయి వ్యసనపరుల అరెస్ట్‌

● పునరావస కేంద్రానికి తరలింపు

చందుర్తి: గంజాయి సేవించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని చందుర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. చందుర్తి సీఐ రవీందర్‌ తన కార్యాలయంలో వివరాలు శుక్రవారం వెల్లడించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు స్థానిక ఎల్లమ్మ గుడి సమీపంలో గురువారం అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని యూరిన్‌ కిట్ల ద్వారా పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా వచ్చింది. వారిని శుక్రవారం మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టి, పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. చందుర్తి సర్కిల్‌ పరిధిలోని చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల పరిధిలో గంజాయి సేవించే వారి వివరాలు సేకరించి, వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్‌, పోలీసులు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement