నా భార్యాపిల్లల్ని మంచిగా చూసుకో.. | - | Sakshi
Sakshi News home page

నా భార్యాపిల్లల్ని మంచిగా చూసుకో..

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

● బావమరిదికి వాట్సాప్‌ మెసేజ్‌

● ఆర్థిక ఇబ్బందులతో

ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

గోదావరిఖని: ‘నా భార్యాల్లల్ని మంచిగా చూసుకో బావమరిది.. నేను చనిపోతున్నా’ అని వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌ పంపిన ఆటోడ్రైవర్‌ ఎండీ రజాక్‌(48) ఉరివేసుకుని చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్‌నగర్‌లో నివాసముంటున్న రజాక్‌ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతునికి ఒకకొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. కొడుకు హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తన కుమారునికి కొడుకు పుట్టడంతో మృతుడి భార్య 15రోజుల క్రితం హైదరాబాద్‌లోని కుమారుని దగ్గరకు వెళ్లింది. చనిపోవడానికి ముందు తన బావమరిదికి వాట్సప్‌లో, తన భార్యా పిల్లలను మంచిగా చూసుకోవాలని వాయిస్‌ మెసేజ్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement