జగిత్యాల అగ్రికల్చర్: ఆరుగాలం శ్రమించి సన్నధాన్యం పండించిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దళారుల చేతులు మారుతున్న కొద్దీ బియ్యం ధర పెరుగుతున్నా.. ఆ మేరకు రైతుకు ఆదాయం రావడం లేదు. ఈ పరిస్థితిలో రైతు పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తే ఇరువర్గాలకూ ప్రయోజనం కలుగుతుంది. రైతుకు అదనపు ఆదాయం సమకూరడంతోపాటు వినియోగదారుడికి నాణ్యమైన బియ్యం అందుతాయి.
లక్ష ఎకరాల్లో సన్నధాన్యం సాగు
జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటి సన్నరకాల వరి సాగు చేశారు. ఎ కరాకు 18–20 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ఈ వానాకాలం సీజన్లో దాదాపు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తయినట్లు అంచనా. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,400–2,600, జైశ్రీరాం రూ.3,200–3,600, హెచ్ఎంటీ రూ.2,700–3,000 వరకు ధర పలుకుతోంది. ఈ ధరలు గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా విక్రయిస్తున్నారు.
గ్రామాల్లో సంఘాలుగా ఏర్పడాలి
సన్నధాన్యం పండించే రైతులు గ్రామాల్లో బియ్యం ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడాలి. రైస్‌మిల్లులతో ఒప్పందం చేసుకుని ధాన్యాన్ని బియ్యంగా మార్చి నేరుగా విక్రయించాలి. పట్టణాల్లోని అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఆర్డర్లు తీసుకుని సరఫరా చేయాలి. వారానికోరోజు పట్టణాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పా టు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మధ్యవర్తుల ప్రమే యం తగ్గి రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది.
దళారులను పక్కనపెట్టి నేరుగా రైతుల
వద్ద కొనుగోలు చేస్తే మేలు
గ్రామాల్లో బియ్యం ఉత్పత్తి సంఘాలతో
అదనపు ఆదాయం
రైతుకు గిట్టుబాటు..
వినియోగదారుడికి నాణ్యమైన బియ్యం


