ఎల్లారెడ్డిపేట: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కనీసం ఆస్పత్రిలో చేర్పించాలన్న స్పృహను మరిచి క్షతగాత్రులను పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో చిన్నారి కాలు విరుగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ బుర్క భాగ్యలక్ష్మి, భర్త గణేశ్, కూతురు ఆద్య వారి బైక్‌పై ఈనెల 25న స్వగ్రామానికి వస్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ తీవ్రంగా గాయపడగా, చిన్నారి ఆద్య కాలు విరిగింది. రోడ్డుపై పడిపోయిన వీరిని కనీసం ఆస్పత్రిలో చేర్పించాలన్న మానవత్వాన్ని సైతం మరిచిపోయి అక్కడి నుంచి పరారయ్యారు. స్వల్పంగా గాయపడ్డ భాగ్యలక్ష్మి తెలిసిన వారి సహాయంతో భర్త, కూతురిని మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు, గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆ మార్గంలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు. కొన్ని కెమెరాల్లో రికార్డయిన స్పష్టంగా లేవు. ప్రమాద విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచులు అందె సుభాష్, ఎలగందుల నర్సింలు, నాయకులు మేడి కిషన్, ఎడ్ల సందీప్, గుల్లపల్లి నర్సింహారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లకు గాయాలు
పట్టించుకోకుండా వెళ్లిపోయిన
ప్రమాదకారకులు


