బంతిపూలు.. పట్టుకుచ్చులు | - | Sakshi
Sakshi News home page

బంతిపూలు.. పట్టుకుచ్చులు

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

● బతుకమ్మ, దసరా పండుగల వేళ.. ● అన్నిరకాల పూలకు మంచి డిమాండ్‌ ● పూలసాగుపై అన్నదాతల ఆసక్తి ● రైతులకు అధిక ఆదాయం

జూలపల్లి/కమాన్‌పూర్‌/మంథనిరూరల్‌: కాలం.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతులు. ఎల్‌నినో ప్రభావంతో వరి, పత్తికి బదులు తక్కువ సమయం, తక్కువ నీటితో సాగయ్యే పూలతోటలపై దృష్టిసారించారు. పండుగల వేళ డిమాండ్‌ ఉండటంతో బంతి, చామంతి, పట్టుకుచ్చులు తదితర పూలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మంథని, కమలాన్‌పూర్‌, జూలపల్లి మండలాల్లోని పలువురు రైతులు ఈఏడాది బంతిపూలు, పట్టుకుచ్చులు, చేమంతి తదితర పూలు సాగు చేశారు. మంథని మండలం నాగారం, విలోచవరం, గుంజపడుగు, సిరిపురం, గద్దలపల్లి తదితర గ్రామాల్లో బంతిపూలు సాగు చేస్తున్నారు. గతంలో పత్తి, వరి సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాక బంతిపూలు సాగు చేశామని రైతులు తెలిపారు.

కిలో రూ.80 పైచిలుకు..

పండుగల వేళ బహిరంగ మార్కెట్‌లో బంతిపూలు కిలో రూ.80కు పైబడే ధర పలుకుతోంది. బతుకమ్మ పండుగ రోజైతే ఒక్కోసారి కిలో రూ.200 వరకు కూడా ఉంటుంది. హోల్‌ సెల్‌లో వ్యాపారులకు రూ.60నుంచి రూ.80 ధరతో రైతులు విక్రయిస్తుంటారు. వ్యాపారులు కిలో రూ.100కు అమ్ముతుంటారు. మంథని, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల వరకు బంతిపూలను తీసుకెళ్లి విక్రయాలు చేస్తుంటారు. నాలుగు నెలలపాటు బంతి, చామంతి, పట్టుకుచ్చులు తదితర పూల అమ్మకాలు జోరుగానే సాగుతుంటాయి. దీంతో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే పూల సాగునే ఎంచుకుంటున్నారు.

మంథని మండలం నాగారంలో సాగు చేస్తున్న బంతిపూల తోట, కమాన్‌పూర్‌ మండలం తెనుగుపల్లెలో సాగు చేస్తున్న సీతమ్మజడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement