మెట్‌పల్లి: మెట్‌పల్లికి చెందిన వేముల శ్రీనివాస్ తన కుమార్తెలు శరణ్య, హర్షితను చిన్నప్పటి నుంచి చదువులో ప్రోత్సహిస్తూ వచ్చారు. వారు పీహెచ్‌డీలు పూర్తి చేసి ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగాలు సాధించారు. శ్రీనివాస్ మెట్‌పల్లిలో హోమియోపతి వైద్యుడు. ఇద్దరు కూతుళ్లను ధర్మపురి సంస్కృత కళాశాలలో తెలుగు సాహిత్యంలో డిగ్రీ.. పీజీ నుంచి పీహెచ్‌డీ వరకు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో చదివించారు. శరణ్య మొత్తం ఆరు గోల్డ్ మెడల్స్, హర్షిత మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇద్దరూ ఒకే రోజున గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. 2019లో ఇద్దరు ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.


