ఆడబిడ్డ.. ఒకప్పుడు ఈ పదం వింటేనే తల్లిదండ్రుల్లో భయం.. గుండెల్లో వణుకు.. ఆడపిల్ల పుట్టిందంటే అరిష్టమనుకునేవారు. మారుతున్నకాలం.. పెరుగుతున్న అక్షరజ్ఞానం ఆడపిల్ల అంటేనే ఇంటికి వెలుగు అనేలా చైతన్యం తీసుకొచ్చింది. చంద్ర మండలంపై అడుగుపెట్టి దరహాసం పంచుతోంది. ప | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ.. ఒకప్పుడు ఈ పదం వింటేనే తల్లిదండ్రుల్లో భయం.. గుండెల్లో వణుకు.. ఆడపిల్ల పుట్టిందంటే అరిష్టమనుకునేవారు. మారుతున్నకాలం.. పెరుగుతున్న అక్షరజ్ఞానం ఆడపిల్ల అంటేనే ఇంటికి వెలుగు అనేలా చైతన్యం తీసుకొచ్చింది. చంద్ర మండలంపై అడుగుపెట్టి దరహాసం పంచుతోంది. ప

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

డాక్టర్‌ ఫ్యామిలీ

వేములవాడ: వేములవాడకు చెందిన వైద్య దంపతులు నాగమల్ల శ్రీనివాస్‌, పద్మలత దంపతుల ఇద్దరు కూతుళ్లు తేజశ్రీ, ఉషశ్రీ వైద్యశాస్త్రం పూర్తి చేసుకుని ఒకే ఇంట్లో నలుగురూ డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. ప్రోత్సాహం, ఉన్నత విద్యనందిస్తే ఆడపిల్లలు కుటుంబానికే కాకుండా దేశానికే గర్వకారణంగా మారతారని ఈ ‘డాక్టర్స్‌ ఫ్యామిలీ’ నిరూపిస్తోంది.

ఇద్దరూ వైద్యవృత్తిలోనే..

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన మామిడిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, లావణ్య వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద కూతురు వర్షిణి ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ(పీడియాట్రిక్‌) పూర్తి చేసింది. చిన్న కూతురు అద్వైత ఎంబీబీఎస్‌ చదువుతోంది. ఇద్దరు కూతుళ్లు వైద్యవృత్తిలో ఉండటం సంతోషంగా ఉందంటున్నారు ఆ తల్లిదండ్రులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement