కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ సహకారంతో ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీని వాస్ తెలిపారు. శనివారం నగరపాలకసంస్థ 21వ డివిజన్ విద్యానగర్‌లో యూఐడీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి శంకుస్థాపన చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
కరీంనగర్ కార్పొరేషన్: చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల్లో అసలైనవారినే ఎంపిక చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇందిరమ్మ గెజిటెడ్ అధికారులు, పెన్షన్ వెరిఫికేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిశీలనలో నిజమైన అర్హులను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. వెరిఫికేషన్‌కు వచ్చే అధికారులు అడిగే ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకొని, అడిగినప్పుడు చూపించాలన్నారు.
అధికారుల అడ్డగింత
గంగాధర: గంగాధర మండలం నారాయణపూ ర్ గ్రామానికి సర్వే చేయడానికి వచ్చిన భూ గర్భ జలశాఖ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులపై నమోదు చేసిన కేసులు ఎత్తి వేయాలని కోరారు. రిజర్వాయర్ పనులు ప్రారంభం కాకముందే, చెరువు నిండకుండానే ఊరు జాలు వారుతోందని పేర్కొన్నారు. అధికారులు సర్వే చేయడానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో వెనుతిరిగారు.
మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం
గంగాధర: మండలంలోని నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందించాలని, లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ నాయకుడు కొత్త జయపాల్‌రెడ్డి హెచ్చరించారు. యాబై రోజులుగా గ్రామస్తులు చేపట్టిన నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాబై రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సమస్యపై ప్రశ్నించే అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకుంటే ముంపుగ్రామంగా అవార్డు చేసి నిధులు ఉన్నప్పుడే ఇవ్వండని కోరుతున్నా పట్టించు కోవడం లేదన్నారు.
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులో పీఎం కుసుం పథకం కింద ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను శనివారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. కరీంనగర్ ఎస్‌ఈ విజయేందర్‌రెడ్డి స్విచ్ఛాన్ చేశారు. రైతులకు ఈ సోలార్ విద్యుత్‌తో ఇబ్బందులు కొంత వరకు తగ్గుతాయన్నారు. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎన్‌పీడీసీఎల్ నుంచి సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించిన వారికి ప్రతి యూని ట్‌కు రూ.3 సంస్థ చెల్లిస్తుందన్నారు. ఆపరేషన్ డీఈ ఎం.తిరుపతి, ఎంఆర్‌టీ డీ.ఈ.చంద్రమౌళి, ఏడీఈ నరేందర్, ఎంఆర్‌టీ ఏడీఈ సుధీర్‌కుమార్, చిగురుమామిడి ఏఈ చంద్రశేఖర్, సబ్ ఇంజినీర్ దేవయాని పాల్గొన్నారు.


