● కరీంనగర్ నుంచి ఇంటికి..
● ప్రాణముందని తెలిసి వేములవాడకు..
● ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు
చందుర్తి(వేములవాడ): కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగిని బతికుండగానే చంపేశారు. వైద్యుల మాటలు నమ్మి ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు వృద్ధుడిలో ప్రాణముందని తెలుసుకొని వెంటనే వేములవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులకు ఓ 75 ఏళ్ల వృద్ధుడికి ఊపీరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో గురువారం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి 24 గంటలకు పైగా చికిత్స చేసిన వైద్యులు.. వృద్ధుడు మృతిచెందాడని శుక్రవారం సాయంత్రం తెలపడంతో స్వగ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో కదలికలు కనిపించాయి. స్వగ్రామం సనుగులకు చేరుకోగానే అంబులెన్స్‌లో లేచి కూర్చున్నాడు. అయితే వృద్ధుడు చనిపోయాడని ఇంటి వద్ద టెంట్లు వేయించిన కుటుంబ సభ్యులు వృద్ధుడు బతికున్నాడని తెలుసుకొని సంతోషించారు. శనివారం ఉదయం వరకు ఇంటి వద్దే వేచి ఉన్న వారు వేములవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న దుబాయ్‌లో ఉన్న ఇద్దరు కొడుకులు హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు.
దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు
● ఫ్రీ రిక్రూట్‌మెంట్
● 28న క్లయింట్ ఇంటర్వ్యూలు
వేములవాడ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏడీఎన్‌హెచ్ సంస్థలో గార్డెనర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి చీటి సతీష్‌రావు తెలిపారు. గార్డెనర్‌కు నెలకు 1,200 ఏఈడీ, ఉచిత భోజనం, ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్, ఉచిత వసతితోపాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని వివరించారు. 21 నుంచి 40 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 28న ఉదయం 11 గంటలకు క్లయింట్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ బయోడేటాను జ ఠ జ్జౌ ఛటజ్టఝఃజఝ్చజీ .ఛిౌఝ కు ఈమెయిల్ చేయవచ్చు లేదా వాట్సాప్ నంబర్ 8332016999 కు పంపవచ్చని తెలిపారు. వివరాలకు నిజామాబాద్ 8686860999, ఆర్మూర్ 8332015999, జగిత్యాల 8332014999, సిరిసిల్ల 9347661522, సికింద్రాబాద్ 8332052299 నంబర్లపై సంప్రదించాలని సతీష్‌రావు తెలిపారు.
మూడో విడత వేదపరీక్షలపై సమీక్ష
వేములవాడ: రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అఖిల భారత వేదశాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు, పరీక్షల నిర్వహణపై ఈవో రమాదేవితో వేదపండితులు శనివారం సమీక్షించారు. వేదపరీక్షల సన్నాహాలు, విధానం, సిలబస్‌పై చర్చించారు. తిరుపతి వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి చెందిన పండితులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరీక్షల నిర్వహణ, పాఠ్యాంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. డీఈవో ప్రతాప నవీన్, వివిధ రాష్ట్రాలకు చెందిన వేద పండితులు అన్నవరపు సూర్యనారాయణశాస్త్రి, కూచిభట్ల తారకరామ శర్మ, ఆనంద శుక్ల ఘనపాఠి, ఆరాధ్యుల బాలకృష్ణ ఘనపాటి, ఖాగరాజు ఘనపాఠి, ఖగరాజ సప్కోట ఘనపాఠి, వి.కృష్ణతేజ, రాజగోపాలాచారి, శైలేషన్ శ్రౌతి పాల్గొన్నారు.
శతాధిక వృద్దుడి కన్నుమూత
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మడ్డి గౌరయ్య (110) శుక్రవారం రాత్రి వయోభారంతో కన్నుమూశాడు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం సుమా రు వంద మందికి పైగా ఉన్నారు.


