రాజన్న హుండీ ఆదాయం రూ.2.31 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రాజన్న హుండీ ఆదాయం రూ.2.31 కోట్లు

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

● రూ.18,550 స్వాధీనం పెద్దపల్లిలో చైన్‌స్నాచింగ్‌ పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని లక్ష్మీనగర్‌ (పదోవార్డు)లో నూనె స్వరూప మెడలో నుంచి బంగారు గొలుసు, మంగళసూత్రం తెంపుకుని పరారయ్యారు. సోమవారం రాత్రి స్వరూప తన ఇంటిముంగు అటూఇటు నడుస్తుండగా పల్సర్‌ బైక్‌పై వచ్చిన అగంతకులు 4తులాల బంగారు గొలుసులను అపహరించుకుపోవడం కలకలం సృష్టించింది. దొంగలు హిందీ భాషలో మాట్లాడుకున్నట్టు బాధితురాలు తెలిపింది. సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు యథేచ్ఛగా వచ్చి చోరీలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్‌ పోలీసు సిబ్బందితో వచ్చి ఘటనపై ఆరా తీశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

వేములవాడ: రాజన్నకు 47 రోజుల్లో స్వామివారి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,31,38,480 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. 137 గ్రాముల బంగారం, 9.200 కిలోల వెండి సమకూరింది. ఆషాఢమాసంలో ఇంత భారీ ఆదాయం రావడం విశేషమని ఈవో పేర్కొన్నారు. కరీంనగర్‌ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, డీఈవో నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పేకాట రాయుళ్ల అరెస్ట్‌

జగిత్యాలక్రైం: సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేట గ్రామంలో పేకాట స్థావరంపై ఎస్సై గీత ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడిచేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,550 స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా పేకాట ఆడితే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.

గంజాయి సేవిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గొల్లపల్లి రోడ్‌లో మంగళవారం సాయంత్రం గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. నిందితులకు పరీక్షలు చేయగా.. గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని ప ట్టణ ఎస్సై సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు కుమారస్వామి పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

వేములవాడ: పట్టణంలోని గుడి చెరువు కట్టకింది బస్టాండ్‌ నుంచి శాత్రాజపల్లి వెళ్లే రోడ్డులోని పెట్రో ల్‌ బంక్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాలక్ష్మివీధికి చెందిన ఏదుల భూమ య్య, కొండయ్యకు తీవ్రగాయాలయ్యాయి. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement