వైఫైతో జాతీయ జెండా ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

వైఫైతో జాతీయ జెండా ఆవిష్కరణ

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

● బాలుడిని అభినందించిన మాజీ స్పీకర్‌ మధుసుదనాచారి

● బాలుడిని అభినందించిన మాజీ స్పీకర్‌ మధుసుదనాచారి

జమ్మికుంట: సెల్‌ఫోన్‌ వైఫై అధారంగా జాతీయ జెండాను ఆవిష్కరించాడు జమ్మికుంట పరిధిలోని కాటిపల్లి రాజు– మానస దంపతుల కుమారుడు సృష్టిసాయి. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృష్టిసాయి తాడు సాయం లేకుండా మొబైల్‌ వైఫై సిగ్నల్‌ పంపగానే మోటర్‌ సాయంతో జెండా పైకి ఎగిరేలా డిజైన్‌ చేశారు. ఏఐ, కోడింగ్‌పై పట్టు సాధించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. బాల మేధావి వినూత్న ఆవిష్కరణ గురించి తెలుసుకున్న మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి సృష్టిసాయి ఇంటికి వెళ్లాడు. అతని ఆవిష్కరణలు వీక్షించి, అభినందించారు. నూతన ఆవిష్కరణలకు తనవంతు ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. గంప నాగేశ్వరావు, ఉదయ్‌కుమార్‌, అంజిరెడ్డి, కిరణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement