కరీంనగర్: తెలంగాణలో ఓటరు తుది జాబితా వెలువడే వరకు బూత్ లెవెల్ ఏజెంట్–2లు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాల ని బీజేపీ లీగల్‌సెల్ కన్వీనర్ ఆంథోనిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపుని చ్చారు. ఎస్‌ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియపై మంగళవారం కరీంనగర్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో సమీక్షించారు. ఎస్‌ఐఆర్ ముసాయిదా లిస్టులో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలిందని, లిస్ట్‌లో తమ ఓటు ఉందో లేదోననే ఆందోళన ఓటర్లలో నెలకొన్న దృష్ట్యా పార్టీ శ్రేణులు వారి కి భరోసా కల్పించాలని కోరారు. అర్హత ఉండి ముసాయిదాలో పేరు లేకపోతే సంబంధిత బీఎల్‌వో, ఎన్నికల అధికారులను సంప్రదించేలా సాయం చేయాలన్నారు. సెప్టెంబర్ 16 లోగా సరైన ఆధారాలతో స్పందించడం కీలకమని స్పష్టం చేశారు. నాయకులు బాస సత్యనారాయణ, హరిబాబు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాసాల రమేశ్, శ్రీనివాసరావు, నాంపల్లి శ్రీనివాస్, రంగు భాస్కరాచారి పాల్గొన్నారు.
బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: పోలింగ్ బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ ప్రధానకార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్‌కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్ల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో పటిష్టంగా నిర్మించడంలో బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు, నాయకులు గంట శ్రీనివాస్, కాంతాల జగన్‌రెడ్డి, పార్వతుల మల్లేశం, విక్రమ్, సికిందర్, ఆకుల ఉదయ్, మడుపు మోహన్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న డంప్‌యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి అంకం శివరాణి ఆధ్వర్యంలో మంగళవారం డంపింగ్‌యా ర్డ్ వద్ద ధర్నా చేపట్టారు. హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తతో కోతి రాంపూర్, లక్ష్మీనగర్, కట్టరాంపూర్, కొత్తయశ్వాడ, కమాన్, బస్టాండ్, అంబేద్కర్ స్టేడియం ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డంపింగ్‌యార్డ్‌ను నగరాని కి దూరంగా తరలించాలని కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరా ముల రమేశ్, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పరశురాం, నూతి చరణ్, బాసవేణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా రణధీర్
కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్, డెంటల్ సర్జన్ ఈరవేణి రణధీర్ నియామకమయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గుండ వీరారెడ్డి మంగళవారం నియామకపత్రం అందజేశారు. ప్రస్తుతం డెంటల్ సర్జన్‌గా సేవలందిస్తున్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది సమన్వయం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షించనున్నారు.


