పెద్దపల్లిలో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్
ఉత్తరాది కార్మికుల కోసం పెద్దసంఖ్యలో సాధారణ రైల్వే బోగీలు
బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వెళ్లేవారికి ఉపయోగకరం
ప్రయాగ్‌రాజ్, కాశీ, గయా భక్తులకు అనుకూలం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వలస జీవులకు కేంద్ర రైల్వేశాఖ తీపి కబురు తీసుకొచ్చింది. సామాన్య, మధ్య తరగతి వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అత్యధికంగా సాధారణ బోగీలు ఉండేలా అమృత్ భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జంక్షన్‌లో రెండు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి జంక్షన్ మీదుగా ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వలసకార్మికులు దాణాపూర్, రక్సల్ వంటి రైళ్లలో ప్రమాదకర స్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. వీటిలో కేవలం నాలుగు సాధారణ బోగీలు ఉండడంతో అందులోనే కిక్కిరిసి ఒక రోజంతా ప్రయాణం చేస్తున్నారు.


