గణేశ్‌ మండపాలకు ఉచిత కరెంట్‌ | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ మండపాలకు ఉచిత కరెంట్‌

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

గణేశ్‌ మండపాలకు ఉచిత కరెంట్‌ ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కొత్తపల్లి(కరీంనగర్‌): నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కరెంట్‌ బిల్లు మొత్తం నగర పాలక సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. 21వ డివిజన్‌ విద్యానగర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో రూ.కోటి మున్సిపల్‌ సాధారణ నిధులతో సీసీరోడ్డు, డ్రెయిన్‌ నిర్మాణ పనులు, 16వ డివిజన్‌ లక్ష్మీపూర్‌, మల్కాపూర్‌లో రూ.15లక్షల 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టిన పైప్‌లైన్‌ పనులకు మంగళవారం మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

పాపన్న స్ఫూర్తితో అధికారం చేపడతాం

సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిలో రాష్ట్రంలో అధికారం చేపడతామని కేంద్ర మంత్రి సంజయ్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. పాపన్న 376వ జయంతి సందర్భంగా మంగళవారం రేకుర్తిలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్‌రావు, సుదగోని మాధవి, బండారి వేణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement