కరీంనగర్ టౌన్: బహుజన నేత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో పాపన్న 376వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలవేసి నివాళి అర్పించారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఎక్స్‌గ్రేషియా, కాటమయ్య కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో స్వామి, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్, గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకులు పడాల స్వామిగౌడ్, పులి ఆంజనేయులుగౌడ్, పడాల అజయ్‌గౌడ్, దూలం అంజన్న గౌడ్, తాళ్లపల్లి ఎల్లాగౌడ్ పాల్గొన్నారు.


