కరీంనగర్‌క్రైం: పెండింగ్ కేసులు తక్షణమే పరిష్కరించాలని సీపీ గౌస్‌ఆలం సూచించారు. కమిషనరేట్‌లో సమావేశ మందిరంలో మంగళవారం జూలై మాస నేరసమీక్ష నిర్వహించారు. నేరం జరిగిన వెంటనే శాసీ్త్రయ ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, అత్యాచారం కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సైబర్ మోసాల్లో బాధితులకు త్వరగా నగదు రికవరీ చేయడంతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు. జూలైలో 15 ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్ విజయవంతంగా పనిచేసిందని సీపీ అభినందించారు. ఇందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు డీసీపీ వెంకటరమణ, డీడీ ప్రాసిక్యూషన్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.


