పకడ్బందీగా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

పకడ్బందీగా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

కరీంనగర్‌కార్పొరేషన్‌: చేయూత పింఛన్‌ దరఖాస్తు ల పరిశీలన పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించా రు. మంగళవారం నగరపాలకసంస్థకార్యాలయంలో ఇంజినీరింగ్‌, రెవెన్యూ, శాని టేషన్‌ విభాగాల గెజిటెడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, మున్సిపల్‌ షాపుల అద్దెల వసూళ్ల పురోగతిపై చర్చించారు. చేయూత పింఛన్‌ పథకం కింద ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదైన ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో ప్రారంభించేలా చూడాలన్నారు. రెండో విడత అర్హుల గుర్తింపునకు మరోసారి విచా రణ చేపట్టాలన్నారు. నగరపాలకసంస్థ అద్దెకిచ్చిన వ్యాపారషాపుల నుంచి నిబంధనల ప్రకారం అద్దె వసూలు చేయాలన్నారు. అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణుమాధవ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజమనోహర్‌, ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement