రాజన్న ఆలయంలో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయంలో విజిలెన్స్‌ తనిఖీలు

Aug 18 2026 12:39 AM | Updated on Aug 18 2026 12:39 AM

● రికార్డులు స్వాఽధీనం చేసుకున్న అధికారులు

వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు విభాగాలను విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు సీఐలు ప్రశాంత్‌రావు, రాజేందర్‌, తహసీల్దారు శ్రీనివాస్‌లతో కూడిన పది మంది అధికారుల బృందం ఆరు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. ఆలయానికి చేరుకున్న ఈ బృందం విచారణ కార్యాలయం, కల్యాణకట్ట, లీజులు, అన్నదానం, గోదాం, లడ్డూ ప్రసాదం, పీఆర్వో కార్యాలయంతోపాటు పలు విభాగాల్లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండో రోజు మంగళవారం సైతం విజిలెన్స్‌ బృందం తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు ఆలయాల నుంచి సొంత గుడికి చేరుకున్న ఉద్యోగులకు నెల రోజుల వ్యవధిలోనే విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టడంతో బెంబేలెత్తిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement