కూతురును చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

కూతురును చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు..

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): బిడ్డ, అల్లుడు, మనుమలు, మనవరాండ్లను చూసేందుకు వెళ్లిన దంపతులకు టిప్పర్‌ యమపాశమైంది. రెండు నిమిషాలైతే కూతురు ఇంటికి చేరుకోవాల్సిన ఆ రైతు అంతలోనే మృత్యువాత పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన సుల్తాన్‌ యాదిరెడ్డి(61), అంజమ్మ(58) బైక్‌పై ఆవునూర్‌లో ఉన్న కుమార్తె మంజుల వద్దకు బయలుదేరారు. జగిత్యాల నుంచి నామాపూర్‌ వైపు వస్తున్న టిప్పర్‌ వీరి బైక్‌ను గూడెం, ఆవునూర్‌ మధ్య ఢీకొట్టింది. ఈ సంఘటనలో యాదిరెడ్డి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ అంజమ్మను అంబులెన్స్‌లో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. కూతురు మంజుల, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి వద్దకు మరో నిమిషమైతే చేరుకునే వారు. నాన్న వస్తున్నాడని ఎదురుచూసిన మంజులకు.. తండ్రి మరణవార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించింది. సంఘటన స్థలాన్ని ఎస్సై జ్యోతి, ఏఎస్సై అశోక్‌కుమార్‌ పరిశీలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్‌ ఢీకొని రైతు దుర్మరణం

తీవ్రంగా గాయపడ్డ భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement