రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ శివారులో ఆదివారం రెండు బైక్‌లు ఢీకొట్టిన సంఘటనలో పలువురు గాయపడ్డారు. పోతుగల్‌కు చెందిన సాయి బైక్‌పై ముస్తాబాద్‌ నుంచి పోతుగల్‌ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆవునూర్‌ నుంచి ముస్తాబాద్‌ వైపు వస్తున్న రాకేశ్‌ బైక్‌ ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఒకే రూట్‌లో రెండు బైక్‌లు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో సాయి కాలు విరిగింది. రాకేశ్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement