కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు సూచనల మేరకు 3వ డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైల్వేట్రాక్ వద్ద ఆదివారం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య మాట్లాడుతూ మూడేళ్ల నుంచి కొనసాగుతున్న ఆర్వోబీ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్రమంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కాశెట్టి శ్రీనివాస్, భాస్కర్ నాయక్, కొలగాని అనిల్, మనోహర్, రాము పాల్గొన్నారు.
1న హైదరాబాద్‌లో భారీ ధర్నా
కరీంనగర్ టౌన్: పీఆర్‌టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ ధర్నా చేపట్టనున్నట్లు సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద 50వేల మందితో భారీ ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవల మరణించిన ఉపాధ్యాయులు వావిలాలసుధ (రామడుగు), ముస్తఫా అహ్మ ద్ కుటుంబాలను పరామర్శించి సంఘం తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఐలేని కరుణాకర్‌రెడ్డి, మర్రి జయపాల్ రెడ్డి, అబ్దుల్ జమీల్, లక్ష్మీనారాయణ, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, ముజీబ్, గౌస్‌ఖాన్ పాల్గొన్నారు.
సివిల్స్ శిక్షణ పరీక్షలు పూర్తి
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లోని బీసీ స్టడీ సర్కి ల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ శిక్షణ ఎంపిక పరీక్షలు ఆదివారం ముగిశాయి. జ్యోతిష్మతి, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్షలు జరిగాయి. 101మంది హాజరైనట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.
రంగస్థల కళాకారుల రాష్ట్ర కార్యవర్గం
కరీంనగర్‌కల్చరల్: రాష్ట్ర రంగస్థల కళాకారుల వేదిక నూతన కార్యవర్గాన్ని సప్తగిరికాలనీలోని కోదండ రామాలయంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బోళ్ల కొమురెల్లి, రాష్ట్ర అధ్యక్షుడిగా తాళ్లపల్లి సంపత్‌గౌడ్, కార్యనిర్వహక అధ్యక్షుడిగా అందె స్వామి, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు రాములు, కోశాధికారిగా గాండ్ల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు అబ్బిడి రాంరెడ్డి, కూకట్ల తిరుపతి ప్రకటించారు. కార్యవర్గ సభ్యులుగా శ్రావణపల్లి శ్రీనివాస్, ఆరెల్లి లక్ష్మీకళ, ఆడెపు ద్వితీయ చందు, తాళ్లపల్లి రాజేశం, నర్సింగోసు రవీంద్రాచారి, పెనుకుల తిరుప తి, పన్నాటి సంతోష్‌కుమార్, మంథని సరిత, తోట విజయ, ముత్యాల సంతోష్, తిప్పారపు ముత్యం, పొన్నం పరశురాములు, బొమ్మరవేణి రాజేశం ఎన్నికయ్యారు.
‘అసత్య ప్రచారం చేస్తున్నారు’
విద్యానగర్(కరీంనగర్): పదవుల కాంక్షతో కొన్ని యూనియన్లు అసత్య ప్రచారాలతో కార్మి కుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏవీఆర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఏవీఆర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ను గెలింపించాలని కోరారు.


