భవానీమాతకు ఒడిబియ్యం | - | Sakshi
Sakshi News home page

భవానీమాతకు ఒడిబియ్యం

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

విద్యానగర్‌(కరీంనగర్‌): శ్రావణ ఆదివారం సందర్భంగా నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారు విఽశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి చీరె సారె సమర్పించి ఒడిబియ్యం పోశారు. సుల్తానాబాద్‌ నుంచి ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, వనభోజనాలు చేశారు. విశ్వహిందు పరిషత్‌, భజరంగదళ్‌ బృందం కరీంనగర్‌ నుంచి బైక్‌ర్యాలీగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్‌ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, నీరుమల్ల తిరుపతి, శివరాం, హరిశ్చంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement