ఆర్టీసీ పనితీరుపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ పనితీరుపై సమీక్ష

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ ఆవరణలోని సమావేశ మందిరంలో గురువారం రీజియన్‌ పరిధిలోని 11మంది డిపో మేనేజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, సిస్టమ్‌ సూపర్‌వైజర్లతో ఆర్‌ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. జూలై చివరినాటికి ఆపరేషన్స్‌, మెకానికల్‌ విభాగాల్లో అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితి, బస్‌ ఆన్‌ కాంట్రాక్టు, ప్యాకేజీ టూర్లకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రమాదాలు, నివారణ చర్యల గురించి సమీక్షించారు. మరో సమావేశంలో రీజనల్‌ మేనేజర్‌, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లతో కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పగిడిమర్రి సోలమన్‌ సమావేశమై డిపోలు లాభాల బాటలో నవడవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. రీజినల్‌ మేనేజర్‌ బి.రాజు, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు ఎస్‌.భూపతి రెడ్డి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు సీహెచ్‌.కవిత, ఎన్‌.వెంకన్న, వి.రవీంద్రనాథ్‌, ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్‌, ఎన్‌.రమేశ్‌, ఎన్‌.మనోహర్‌, డి.హరి, ప్రకాశరావు, శ్రీనివాస్‌, సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement