జిల్లా ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఓటర్లు

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

జిల్లా ఓటర్లు 9,11,988

ముసాయిదా జాబితా ప్రకారం నియోజకవర్గాల వారీగా ఓటర్లు

లెక్క తేలింది ‘సర్‌’

శాశ్వత షిఫ్ట్‌ అయిన ఓట్లు 1,18,391

మృతి చెందిన ఓటర్లు 30,183

అన్ని నియోజకవర్గాల్లోనూ తగ్గిన ఓటర్లు

కరీంనగర్‌ అర్బన్‌: స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌(సర్‌)తో ఆసక్తికర అంకెలు చోటు చేసుకున్నాయి. డ బుల్‌ ఓటర్లు, మరణించినవారి సంఖ్య గణనీయంగా కనిపించింది. ఎన్నికల సంఘం జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించగా జిల్లావ్యాప్తంగా 1,77,102మందిని తొలగించారు. అత్యధికంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో 1,00,618 ఓటర్లను తొలగించడం గమనార్హం. అత్యల్పంగా మానకొండూరు నియోజకవర్గంలో 19,658 మంది ఓటర్లను తొలగించారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లా మొత్తం ఓటర్లు 9,11,988. తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 12న ప్రకటించనుండగా మరిన్ని ఓట్లు తొలగించే అవకాశముందని తెలుస్తోంది.

శాశ్వత షిఫ్ట్‌లో కరీంనగర్‌ టాప్‌.. గన్నేరువరం లాస్ట్‌

సర్‌.. ప్రక్రియలో ఆయా అంశాల వారీగా ఓటర్ల గణాంకాలను వెల్లడించారు. మండలాల వారీగా శాశ్వతంగా షిఫ్ట్‌ అయినవారు కరీంనగర్‌ పట్టణంలోనే ఎక్కువగా ఉన్నారు. 59,766 మంది షిఫ్ట్‌ కాగా.. అత్యల్పంగా షిఫ్ట్‌ అయిన మండలం గన్నేరువరం. ఇక్కడి నుంచి 661మంది ఓటర్లు మాత్రమే వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కరీంనగర్‌ రూరల్‌ 6159, కొత్తపల్లి 8,430, చొప్పదండి 3,187, గంగాధర 3,287, రామడుగు 2,314, మానకొండూరు 2,605, శంకరపట్నం 1,905, తిమ్మాపూర్‌ 2,607, హుజూరాబాద్‌ 4,571, వీణవంక 2,082, జమ్మికుంట 5,957, ఇల్లందకుంట మండలాలవారు 1,163మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి 74,355 మంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా హుజూరాబాద్‌ 16,384, చొప్పదండి 16,291, మానకొండూరు 11,361 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు షిఫ్ట్‌ అయ్యారు. ఇక మరణించిన ఓటర్ల సంఖ్యలో కరీంనగర్‌ 6,373 మంది ఉన్నట్లు తేలగా హుజూరాబాద్‌ 1,981, జమ్మికుంట 1,847, మానకొండూరు 1,543, కరీంనగర్‌ రూరల్‌ 1,545, కొత్తపల్లి 1,511, వీణవంక 1,462, చొప్పదండి 1,381, రామడుగు 1,339, గంగాధర 1,167, తిమ్మాపూర్‌ 1,098, శంకరపట్నం 5,77, ఇల్లందకుంట 399 మంది ఓటర్లు ఉన్నారని తేల్చారు.

డబుల్‌ ఓటర్లు 17,812

ఒక చోట కాకుండా మరో ప్రాంతంలోనూ ఓటర్లుగా నమోదైనవారు వేలల్లో ఉండటం విశేషం. జిల్లాలో 17,812 మంది ఓటర్లు తమ సొంత ఊళ్లలో, నివసించే పట్టణాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నట్లు గుర్తించారు. డబుల్‌ ఓట్లు కరీంనగర్‌లో 5,297, కరీంనగర్‌ రూరల్‌ 1,456, కొత్తపల్లి 1,326, చొప్పదండి 252, గంగాధర 1,510, రామడుగు 1,012, మానకొండూరు 817, శంకరపట్నం 228, తిమ్మాపూర్‌ 669, గన్నేరువరం 153, హుజూరాబాద్‌ 605, వీణవంక 607, జమ్మికుంట 454, ఇల్లందకుంట మండలంలో 209 ఉన్నాయని వెల్లడైంది. ఇక బీఎల్‌వోలు ఇంటికి వెళ్లినప్పుడు 6,149 మంది అందుబాటులో లేరని పేర్కొన్నారు.

జాబితా చూసుకుంటేనే సరి

ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు తొలగించారని ఆందోళన చేసే బదులు తాజా జాబితాను పరిశీలించడం ఉత్తమం. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకుంటే తుది జాబితా ప్రక్రియ వరకై నా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశముంది. ఫిర్యాదులు, అభ్యంతరాలకు సెప్టెంబర్‌ 9వరకు అవకాశముండగా అధికారులు వచ్చిన అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేయనుండగా అక్టోబర్‌ 10లోపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తుది ఓటరు జాబితా అక్టోబర్‌ 12న ప్రకటించనున్నారు.

నియోజకవర్గం గతంలోని ఓట్లు ప్రస్తుతం లెక్కకురానివి

కరీంనగర్‌ 3,68,832 2,68,214 1,00,618

చొప్పదండి 2,39,716 2,11,115 28,601

మానకొండూరు 2,26,250 2,06,592 19,658

హుజూరాబాద్‌ 2,54,292 2,26,067 28,225

సర్‌కు ముందు జిల్లా

మొత్తం ఓటర్లు: 10,89,090

సర్‌ ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు: 9,11,988

తొలగించిన ఓట్లు: 1,77,102

ఫిర్యాదులు, అభ్యంతరాలు: ఈ నెల 10నుంచి సెప్టెంబర్‌ 9వరకు

నోటీసుల జారీ, పరిశీలన: ఈ నెల 10నుంచి అక్టోబర్‌ 10

తుది ఓటరు జాబితా: అక్టోబర్‌ 12, 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement