బోర్డు తిప్పేయడంతో లబోదిబో | - | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేయడంతో లబోదిబో

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

బోర్డు తిప్పేయడంతో లబోదిబో

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు బాగానే తన కస్టమర్లకు నెలనెలా డబ్బులు పంపిన సంస్థ అకస్మాత్తుగా జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. రేపు మాపూ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వారంలో విజయవాడకు చెందిన ఎంఎక్స్‌వో కంపెనీ ప్రతినిధులందరి ఫోన్లు మూగబోవడంతో మోసపోయామని గ్రహించారు. కొందరు విజయవాడకు వెళ్లి కంపెనీ ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేసినా అవేమీ సఫలం కాలేదు. దీంతో మెటీరియల్‌ కొనుగోలు చేసిన వారంతా డిస్ట్రిబ్యూటర్ల వెంట పడుతుంటే.. వారంతా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నారు. మోసపోయిన వారిలో చాలామంది గత నెలలో మెటీరియల్‌ కొన్న వారు కూడా ఉండటం గమనార్హం. తమకు కనీసం ఒక నెల చెల్లింపులు కూడా దక్కలేదని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement